జేడీయూ సీనియర్ నేత కైలాశ్ మహశో హత్య
ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు గురువారం సాయంత్రం వేళలో కాల్చి చంపారు..
jdu senior leader kailash mahto
జేడీయూ సీనియర్ నేత కైలాశ్ మహతో(70) దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు గురువారం సాయంత్రం వేళలో కాల్చి చంపారు. కటిహార్ జిల్లాలోని బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఇంటికి సమీపంలో జరిగిందీ ఘటన. ఆయనకు అతి సమీపంలో నుండి కాల్పులు జరపడంతో.. ఆయన పొట్ట, తలలోకి తూటాలు చొచ్చుకెళ్లాయి.
కైలాష్ హత్యకు భూ తగాదాలే కారణమని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే కైలాష్ తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, భద్రత కల్పించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయనపై దాడి చేసి, దుండగులు హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది. కైలాష్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. త్వరలోనే నిందితులను పట్టుకుని శిక్షిస్తామని చెప్పారు.