మిస్టరీ వీడింది... ఆ మృతదేహం అతనిదే

రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. ముషీరాబాద్ కు చెందిన కిషోర్ గా పోలీసులు గుర్తించారు.

Update: 2021-12-08 06:22 GMT

రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. మృతుడు ముషీరాబాద్ కు చెందిన కిషోర్ గా పోలీసులు గుర్తించారు. కిషోర్ సోదరి మృతదేహాన్ని చూసి గుర్తించారు. దీంతో రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో ఉన్న మృతదేహం మిస్టరీ వీడిపోయింది. కిషోర్ గత కొంతకాలం క్రితం ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

హత్య కేసుగా దర్యాప్తు....
మరి కిషోర్ ను హత్య చేసి వాటర్ ట్యాంకులో పడేశారా? ఎవరు వారు? హత్యకు కారణాలేంటి? అన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం కలకలం రేపింది. హత్య చేసి వాటర్ ట్యాంకులో పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిషోర్ స్నేహితులు, సన్నిహితులను, బంధువులను విచారించే అవకాశముంది.


Tags:    

Similar News