వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్.. అధికారిక ప్రకటన రానుందా..?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Update: 2022-05-23 06:10 GMT

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. కేసు నుంచి తప్పించుకునేందుకు అనంతబాబు విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించడంతో అనంతబాబు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పటికే పోలీసులు అనంతబాబుపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. హత్య కేసుకు సంబంధించి అనంతబాబు అనుచరులు కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కొట్టిచంపినట్లు ఎమ్మెల్సీ అనుచరులు చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న అనంత ఉదయభాస్కర్.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.

సుబ్రహ్మణ్యం పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమికంగా హత్యేనని నివేదిక సారాంశంగా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్యంను చాలా దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. తలపై బలంగా మోదారు. చేతులు విరిచేశారు. ప్రైవేట్‌ పార్ట్స్‌పై బలంగా కొట్టారు. గొంతు నొక్కడంతో ఊపిరి ఆగిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఐదేళ్లపాటు డ్రైవర్ గా పనిచేసిన యువకుడ్ని దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నాయి. బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఎమ్మెల్సీ చెప్పినా.. దానికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అనంతబాబు చుట్టూ ఉచ్చుబిగిసింది.
ఈనెల 20న రాత్రి 7.30కి అనంతబాబు అనుచరుడు మణికంఠతో కలిసి సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లాడు. 12.30కి ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యం తల్లికి యాక్సిడెంట్ జరిగిందని ఫోన్ చేశాడు. 1.30కి వాళ్ల తమ్ముడు నవీన్ కి అనంత బాబు కాల్ చేసి ఆస్పత్రికి రమ్మని చెప్పారు. ఆస్పత్రిలో డాక్టర్లు చనిపోయాడని చెప్పారు. ఆస్పత్రి నుంచి ఇంటికి ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ తీసుకు వచ్చారు. నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ అక్కడే ఉన్నారు. సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు ఎస్పీ. ఆ తర్వాత 302 ప్రకారం హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.


Tags:    

Similar News