ఐఐటీ మద్రాస్ లో మరో విద్యార్థి బలవన్మరణం
తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోన్న విద్యార్థి..
b tech student suicide in IIT madras
ఐఐటీ మద్రాస్ లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడగా.. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోన్న విద్యార్థి హాస్టల్ గదిలో శవమై కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన విద్యార్థి ఐఐటీ మద్రాస్ లో బీటెక్ సెకండియర్ (కెమికల్ ఇంజినీరింగ్) చదువుతున్నట్లు తెలిపారు.
పోలీసుల విచారణ అనంతరం ఆత్మహత్యగా నిర్థారణ అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇది నాల్గవ సూసైడ్ అవుతుంది. ఏప్రిల్ ఆరంభంలో ఐఐటీ మద్రాస్ లో పశ్చిమ బెంగాల్ కు చెందిన 32 ఏళ్ల పీహెచ్ డి విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు ఏపీకి చెందిన బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి కూడా బలవన్మరణం చెందాడు. ఫిబ్రవరిలో మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్ స్కాలర్ ఐఐటీ మద్రాస్ లో సూసైడ్ చేసుకున్నారు.