ఆర్జీఐఏ వద్ద రూ.12 కోట్లు విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
స్పష్టమైన సమాచారం ఆధారంగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్టెలిజెన్స్ హైదరాబాద్
స్పష్టమైన సమాచారం ఆధారంగా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్టెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు దుబాయ్ నుండి వచ్చిన ఓ భారతీయ మహిళా ప్రయాణికురాలిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం , హైదరాబాద్ లో అడ్డుకున్నారు.
ప్రయాణికురాలి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి లభించింది. అనంతరం విచారణలో, ఆమె చెక్‌ఇన్ చేసిన మరో బ్యాగ్ మిస్సయిందని, దానిపై ఇప్పటికే ఫిర్యాదు చేసిందని తెలిసింది. ఆ బ్యాగ్ 20.09.2025 న హైదరాబాద్ చేరగా, దానిలో మరో 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి దొరికింది.
మొత్తం 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి(మార్కెట్ విలువ సుమారు రూ.12 కోట్లు), స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికురాలిని NDPS చట్టం, 1985 ప్రకారం అరెస్టు చేశారు.