భార్యకు తెలీకుండా భర్త మూడు పెళ్లిళ్లు.. అడ్డుకున్న భార్య

వరకట్న వేధింపులపై భువనగిరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. దాంతో మధుబాబు..

Update: 2022-02-21 10:46 GMT

భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకోవాలని మూడుసార్లు ప్రయత్నించాడు ఆ భర్త. భర్త మరో పెళ్లికి సిద్ధమైనప్పుడల్లా ఆ భార్య అడ్డుకునేది. తాజాగా కృష్ణాజిల్లాలో భర్త మరో యువతిని మోసం చేసి, పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న ఆ భార్య.. పెళ్లిని అడ్డుకుని భర్తను పోలీసులకు అప్పగించింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు అనే వ్యక్తికి.. హైదరాబాద్ లోని బోడుప్పల్ కు చెందిన యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన ఏడాది వరకూ వారి కాపురం బాగానే ఉన్నా.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి.

వరకట్న వేధింపులపై భువనగిరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. దాంతో మధుబాబు భార్య మూడేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. భార్య పుట్టింటికి వెళ్లాక.. మధుబాబు రెండుసార్లు పెళ్లి చేసుకోవాలని చూశాడు. కానీ భార్య ఆ పెళ్లిళ్లను అడ్డుకుంది. ముచ్చటగా మూడోసారి మరోసారి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. కోదాడకు సమీప గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయానికి వచ్చాడు.
భర్త మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న భార్య.. ఆ పెళ్లిని అడ్డుకునేందుకు తన పుట్టింటివారితో కలిసి గుడికి వచ్చింది. ఆలయంలో తిరునాళ్లు జరుగుతుండటంతో అంతా రద్దీగా ఉంది. ఇంతలో పెళ్లి బృందాన్ని.. కొత్త పెళ్లికూతురితో కలిసి పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న భర్త మధుబాబును చూసింది భార్య. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి అతనిపై దాడి చేసి పెళ్లిని అడ్డుకుంది. ఆడపెళ్లివారికి జరిగిన తతంగమంతా వివరించడంతో.. వారి ఛీ కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన భర్తను పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఫిర్యాదు చేయగా.. భువనగిరిలో కేసు నమోదైంది కాబట్టి మళ్లీ కేసు అక్కర్లేదని పోలీసులు చెప్పడంతో పుట్టింటివారితో తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయింది.


Similar News