Road Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది స్పాట్ డెడ్

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు.

Update: 2025-08-25 02:06 GMT

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ హషర్ జిల్లా అరనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. జహర్ వీర్ దర్శనం కోసం ట్రాక్టర్ లో బయలుదేరి వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను వెనక నుంచి భారీ కంటైనర్ వచ్చి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఎనిమిది మంది మరణించగా, మరో నలభై మందికిపైగానే గాయాలయ్యాయని చెబుతున్నారు.

గాయపడిన వారిలో...
ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే అక్కడకు పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా చాలా సేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీనిని పోలీసులు చక్కదిద్ది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News