మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి వాహనం లోయలో పడటంతో స్పాట్ లోనే ఏడుగురు మృతి చెందారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి వాహనం లోయలో పడటంతో స్పాట్ లోనే ఏడుగురు మృతి చెందారు. పాపల్వాడీలోని కుందేశ్వర్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.
తీవ్రగాయాలపాలైన...
మరొకవైపు ఈ వాహనంలో ప్రయాణిస్తున్న మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పాపల్వాడీలోని కుందేద్శర్ ఆలయానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితిఅనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.