మూఢనమ్మకంతో ప్రియుడి హత్య.. పెళ్లైన 14 రోజులకే..

ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి.. కన్యాకుమారిలోని తన ఇంటికి రప్పించింది గ్రీష్మ. కుటుంబ సభ్యులు తమ సంప్రదాయం ప్రకారం ఇద్దరికీ

Update: 2022-10-31 12:49 GMT

greeshma kills sharonraj

ప్రియురాలే తన ప్రియుడ్ని హతమార్చిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఆమె అతడిని ఎందుకు చంపిందో తెలిస్తే షాకవుతారు. వేరే యువతితో ప్రేమలో ఉండటమో, పెళ్లి చేసుకోవడమో అందుకు కారణం కాదు. మూఢనమ్మకమే ఆ యువతిని హంతకురాలిని చేసింది. అంధ విశ్వాసాల కారణంగా సాటి మనుషుల్ని బలి తీసుకుంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళలోని తిరువనంతపురం జిల్లా, పరస్సాలకు చెందిన షరోన్ రాజ్‌ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.

ఇద్దరి మధ్య తరచూ గొడవలు, మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ కలవకూడదనుకున్నారు. ఇటీవలే గ్రీష్మకు మరో వ్యక్తితో నిశ్చితార్థమయింది. సెప్టెంబర్లో వివాహం చేయాలనుకున్నారు.. కానీ అది వాయిదా పడింది. ఇద్దరి జాతకాల్లో ఏమైనా దోషముందేమో అని తెలుసుకునేందుకు గ్రీష్మ ఓ జ్యోతిష్యుడిని సంప్రదించింది. అతను నీ మొదటి భర్త చనిపోతాడని చెప్పాడు. దాంతో గ్రీష్మ కంగారు పడింది. ఆ తర్వాత ఆలోచించి.. మళ్లీ షరోన్ రాజ్ తో మాట్లాడింది. నిన్ను విడిచి ఉండలేనంటూ మొసలి కన్నీరు కార్చింది. ఆమె మాటల్ని గుడ్డిగా నమ్మేశాడు షరోన్.
ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి.. కన్యాకుమారిలోని తన ఇంటికి రప్పించింది గ్రీష్మ. కుటుంబ సభ్యులు తమ సంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పెళ్లి జరిపించారు. అంతకుముందే తిరువనంతపురంలోని చర్చిలో పెళ్లిచేసుకున్నట్లు సమాచారం. తన మాయమాటలతో అతడిని నమ్మించిన గ్రీష్మ.. కలిసిన ప్రతిసారి స్లో పాయిజన్ కలిపిన జ్యూస్ లు ఇచ్చేది. పెళ్లి అనంతరం ఇంట్లో స్నేహితులతో కలిసి కూల్ డ్రింక్ పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో గ్రీష్మ.. షరోన్ కు పురుగులమందు కలిపిన ఆర్గానిక్ డ్రింక్ ఇచ్చింది. అది తాగిన వెంటనే అతను వాంతులు చేసుకున్నాడు.
వెంటనే అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. మా వల్ల కాదని చేతులెత్తేశారు. 14 రోజులపాటు ఒక్కో అవయవం పనిచేయకుండా.. చివరికి తనువు చాలించాడు. పెళ్లైన 14 రోజులకే కుమారుడు చనిపోవడంపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో భాగంగా గ్రీష్మను లోతుగా ప్రశ్నించడంతో.. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు పన్నిన పన్నాగం బయటపడింది. ప్రస్తుతం జైల్లో కటకటాలను లెక్కిస్తోంది.



Tags:    

Similar News