ఓ వైపు బోనాలు.. ఇంతలో సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలికా బజార్ లోని ఓ బట్టల షాప్ లో మంటలు చెలరేగాయి.

Update: 2023-07-09 03:06 GMT

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలికా బజార్ లోని ఓ బట్టల షాప్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. అగ్నికీలలు పక్కనున్న షాప్‌లకు సైతం విస్తరించాయి. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాలన్ని దట్టమైన పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

బట్టల దుకాణం పక్కనే లాడ్జ్ ఉండగా.. ఆ లాడ్జిలో ఉన్న వాళ్లందర్నీ ఖాళీ చేయించింది ఫైర్ సిబ్బంది. పొగలు ఇతర షాపులోకి వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. మంటలు అంటుకున్న షాపుకు చుట్టుపక్కల్లో బట్టల హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు రంగం లోకి దిగాయి. మరొక బట్టల దుకాణంతోపాటు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లోకి మంటలు విస్తరించాయి.
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే ఈరోజు లష్కర్‌ బోనాలు జరుగుతుండడంతో ఈ అగ్నిప్రమాదం కారణంగా భక్తులు టెన్షన్ పడుతూ ఉన్నారు. పోలీసులు సైతం అప్రమత్తమై ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూసుకుంటూ ఉన్నారు.


Tags:    

Similar News