గుంటూరు టిడిపి-వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ.. 17 మందికి గాయాలు

కారుమంచిలో ఇటీవల తిరునాళ్లు జరిగాయి. అప్పట్నుంచి టిడిపి-వైసిపి వర్గాల మధ్య వివాదం రాజుకుంటోంది. తాజాగా ఆ వివాదం..

Update: 2022-04-07 05:07 GMT

గుంటూరు : ఏపీలో రాజకీయ కక్షలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా వైసిపి - టిడిపి నేతల మధ్య వైరం ఎక్కువవుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. శావల్యాపురం మండలం కారుమంచిలో వైసిపి - టిడిపి కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 17 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి.

కారుమంచిలో ఇటీవల తిరునాళ్లు జరిగాయి. అప్పట్నుంచి టిడిపి-వైసిపి వర్గాల మధ్య వివాదం రాజుకుంటోంది. తాజాగా ఆ వివాదం ముదిరి ఘర్షణకు దారి తీసింది. అధికార - ప్రతిపక్షాల మధ్య ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News