విశాఖలో దారుణం.. కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి
కామ కోరికను తీర్చుకునేందుకు శిశువు నుంచి వృద్ధమహిళల వరకూ ఎవరినీ వదలట్లేదు మృగాళ్లు. ఆడవాళ్లైతే చాలు..
15 years girl pregnant
మానవత్వం అనేది ఉందా అంటే.. సమాజంలో జరిగే దారుణాలు చూస్తే లేదనే అనిపిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలపై జరిగే దారుణాలు చూస్తే.. అందుకు కారణమైనవారిని శిక్షించే హక్కు సమాజానికి ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. కామ కోరికను తీర్చుకునేందుకు శిశువు నుంచి వృద్ధమహిళల వరకూ ఎవరినీ వదలట్లేదు మృగాళ్లు. ఆడవాళ్లైతే చాలు.. వారితో తమ కోరిక తీరితే చాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు మృగాళ్లు. ఇంటి నుండి బయటికెళ్తేనే కాదు.. ఇంట్లోనే ఉన్న కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి నుండి కూడా రక్షణ లేకుండా పోతోంది. తాజాగా.. విశాఖలో 15 ఏళ్ల కూతుర్ని కన్నతండ్రే గర్భవతిని చేసిన దారుణ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ పెదగంట్యాడ మండలం గంగవరంలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కన్నకూతురిపై అత్యాచారం చేసి.. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం బాలిక మేనమాకు తెలియడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడైన ముత్యాలు ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.