స్కూల్ బస్ డ్రైవర్‌కు గుండెపోటు.. విద్యార్థులంతా?

బస్సులో విద్యార్థులను తీసుకెళుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు

Update: 2023-09-20 06:55 GMT

ఒక స్కూలు బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. బస్సులో విద్యార్థులను తీసుకెళుతుండగా డ్రైవర్ కు గుండెపోటు రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దీంతో విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకర్గం ఉప్పలపాడు దగ్గర ఈ ఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్ చెందిన బస్సు ఉదయాన్నే విద్యార్థులతో బయలుదేరింది. ప్రమాద సమయంలో మొత్తం నలభై మంది విద్యార్థులున్నారు. అయితే కొద్ది దూరం వచ్చిన వెంటనే బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి కుప్పకూలిపోయాడు. రోడ్డు మధ్యలోనే బస్సును నిలిపేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు.

తాను మృతి చెందినా...
అక్కడే ప్రాణాలను విడిచాడు. మరణించిన డ్రైవర్ ను ఏడుకొండలుగా గుర్తించారు. తన ప్రాణాలు పోతున్నా చిన్నారులను కాపాడేందుకు ఆ డ్రైవర్ చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు. డ్రైవర్ కుటుంబాన్ని ప్రయివేటు విద్యాసంస్థ యాజమాన్యం ఆదుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన తెలియడంతో తల్లిదండ్రులంతా బస్సు వద్దకు వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News