15 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15.36 కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు

Update: 2022-12-18 06:47 GMT

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15.36 కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్ 1,024 గ్రాములు ఉంటుందని చెబుతున్నారు.ఆఫ్రికా నుంచి వచ్చిన ఒక ప్రయాణకురాలి నుంచి ఈ కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.

కడుపులో దాచి....
అయితే కొకైన్ ను టాబ్లెట్ రూపంలో కడుపులో దాచి మరీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే అనుమానం వచ్చిన అధికారులు ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి పొట్టలో దాచిన కొకైన్ ను బయటకు తీశారు. మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News