Jayaprada : జయప్రదను అరెస్ట్ చేసి మా ముందు హాజరుపర్చండి

ప్రముఖ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రదపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Update: 2024-02-14 02:29 GMT

Jayaprada :ప్రముఖ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రదపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు సమన్లు జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఆమె ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులకు సంబంధించి జయప్రద హాజరు కాలేదు.

ఈ నెల 27న హాజరుపర్చాలని...
దీంతో జయప్రదను అరెస్ట్ చేసి ఈ నెల 27వ తేదీన న్యాయస్థానం ఎదుట హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను విచారణ చేస్తున్న ప్రజాప్రతినిధుల కోర్టు ఈ మేరకు సమన్లు జారీ చేసింది.


Tags:    

Similar News