Jony Master : వేధింపులపై జానీ మాస్టర్ ఏమన్నారంటే?
తనపై నమోదయిన కేసులపై కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. తాను ఎవరిపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు
jony master
తనపై నమోదయిన కేసులపై కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ స్పందించారు. తాను ఎవరిపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కుట్ర పన్నారని, దీని వెనక ఎవరున్నారో తనకు తెలుసునని జానీ మాస్టర్ అన్నారని తెలిసింది. అయితే తాను న్యాయపరంగా పోరాడి ఈ కేసుల నుంచి బయటపడతానని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యాయపరంగా...
తాను నిజాయితీగా ఉన్నానని, ఇకపై కూడా ఉంటానని జానీ మాస్టర్ అన్నారు. తనకు ఏ పాపం తెలియకపోయినా తనను కావాలని ఈ కేసులో ఇరికించి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన అన్నారు. కాగా జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు.