పేలిన చిమ్నీ.. 9 మంది దుర్మరణం

Update: 2022-12-24 08:17 GMT

బీహార్లోని ఇటుక బట్టీలో ఉన్న చిమ్నీ పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ప్రమాద ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.గాయపడ్డవారిని హాస్పిటల్లో చేర్పించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో, చిమ్నీ లో పేలుడు సంభవించి తొమ్మిది మంది మృత్యువాత పడటంతో పాటు, అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులలో ఇటుక బట్టి యజమాని మహమ్మద్ఇష్రార్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇటుక బట్టి పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News