ఐదో రోజు విశాఖ డ్రగ్స్ కేసు.. సీబీఐ అధికారులు

విశాఖ డ్రగ్స్ కేసును ఐదో రోజు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి

Update: 2024-03-24 05:39 GMT

విశాఖ డ్రగ్స్ కేసును ఐదో రోజు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడ్డ నేపథ్యంలో సీబీఐ అధికారులు విశాఖలోనే ఉండి దర్యాప్తు ముమ్మరం చేశారు. కంటైనర్ లో రొయ్యల మేత మాటున ఈ డ్రగ్స్ ను తరలించినట్లు గుర్తించారు.

ఫోరెన్సిక్ నివేదిక...
డ్రైఈస్ట్‌తో కలిపి డ్రగ్స్ ను రవాణా చేస్తున్నట్లు గుర్తించిన సీబీఐ అందులో వచ్చిన నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. రిపోర్టు రెండు రోజుల్లో అందనుంది. ఈ డ్రగ్స్ ను మరొక కంటైనర్ లోకి మార్చి ప్రత్యేకంగా సీల్ వేశారు. ఇంత పెద్దమొత్తంలో విశాఖలో డ్రగ్స్ పట్టుబడటంతో రాజకీయంగా కలకలం రేగింది. అనేక విమర్శలు రేగాయి. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ ను ఎవరు తెస్తున్నారన్న దానిపై సీబీఐ లోతుగా విచారణ చేస్తుంది.


Tags:    

Similar News