Kurnool Bus Accident : ప్రమాదానికి గురైన బస్సు పై రవాణా శాఖ అధికారులు ఏమన్నారంటే?

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు గురించి కొన్ని కీలక విషయాలను రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు

Update: 2025-10-24 04:45 GMT

కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు గురించి కొన్ని కీలక విషయాలను రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పదుల సంఖ్యలో మరణించిన సంగతి తెలిసింది. ప్రమాదానికి గురైన బస్సు DD01N9490 నంబరుతో రిజిస్టర్‌ అయింది. కావేరి ట్రావెల్స్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న డామన్‌ డయ్యూలో రిజిస్ట్రేషన్‌ చేశారు. 2030 ఏప్రిల్‌ 30 వరకు టారిస్ట్‌ పర్మిట్‌ జారీ అయింది.

ఫిట్ గా ఉందని...
ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. ప్రమాదానికి గురైన బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్‌ ఉంది. 2026 ఏప్రిల్‌ 20 వరకు బస్సుకు ఇన్స్యూరెన్స్‌ ఉంది.. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వ్యాపించాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కు చెందిన రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి గురైన బస్సు పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉందని చెప్పారు.
నలభై ఒక్క మంది ప్రయాణికులు...
మరొకవైపు కర్నూలు ప్రమాద ఘటనలో బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. సురక్షితంగా ఉన్న 19 మందిని గుర్తించామని, గాయపడిన వారు ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండటంతో తేరుకునేలోపు బస్సు దగ్దమైందని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. ఒక బస్సు డ్రైవర్ తమ అదుపులో ఉన్నారు.. మరో డ్రైవర్ పరారీలో ఉన్నాడని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News