Breaking : కేంద్ర మంత్రి మాంఝీ మనవరాలి కాల్చివేత

బీహార్ గయలో దారుణం చోటు చేసుకుంది. కేంద్రమంత్రి మాంఝీ మనవరాలని ఆమె భర్త కాల్చి చంపారు.

Update: 2025-04-09 13:41 GMT

బీహార్ గయలో దారుణం చోటు చేసుకుంది. కేంద్రమంత్రి మాంఝీ మనవరాలని ఆమె భర్త కాల్చి చంపారు. కుటుంబ వివాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కుటుంబంలో తలెత్తిన విభేధాల కారణంగా సుష్మను ఆమె భర్త గన్ తో కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. అయితే ఎందుకు ఈ ఘటన జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కుటుంబంలో నెలకొన్న...
గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య నెలకొన్న విభేదాలు ఈ ఘటనకు కారణమయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు


Tags:    

Similar News