Acid Attack : కర్ణాటకలో యాసిడ్ దాడి: ఇద్దరు చిన్నారులకు గాయాలు

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఇద్దరు చిన్నారులపై యాసిడ్ గాయపరిచాడని పోలీసులు తెలిపారు.

Update: 2025-09-06 05:57 GMT

కర్ణాటక రాష్ట్రంలోని పనతడీ గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఇద్దరు చిన్నారులపై యాసిడ్ గాయపరిచాడని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరు దాడి చేసిన వ్యక్తి కుమార్తె అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో పన్ తాడి గ్రామంలో ని భార్య సోదరుడి ఇంట్లో దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

దక్షిణ కన్నడ జిల్లాలో
దీనిపై రాజాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మనోజ్ దక్షిణ కన్నడ జిల్లా, కరికె గ్రామానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలికలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలకు చికిత్స జరుగుతుంది.


Tags:    

Similar News