ఎంతకు తెగించార్రా.. 2 వేల కేజీల టమాటాలు చోరీ.. అంతటితో ఆగక..

బెంగళూరు చిత్రదుర్గలోని ఓ రైతు.. నిద్రహారాలు లేకుండా టమాట పంట చేతికొచ్చే వరకూ చూసుకున్నాడు. పంటను కోసి..

Update: 2023-07-10 13:29 GMT

2000 kg tomato robbed in bengaluru

టమాటాలు.. ఇప్పుడు బంగారానికంటే.. వీటికే విలువ ఎక్కువ. ఎవరైనా ఊరికే ఇస్తే బాగున్ను అనేంతలా ఉన్నాయి టమాటాల ధరలు. కిలో రూ.2 కే దొరికినపుడు టమాటా విలువ తెలియలేదు. ఇప్పుడు కిలో రూ.200 వరకూ పలుకుతుండటంతో.. అమ్మో టమాటాలు అంత రేటుకు కొనాలా ? అనుకుంటున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిలోలు కొనే రోజులు పోయి అత్యవసరానికి 50 గ్రాములు, 100 గ్రాములు కొనుక్కోవాల్సిన పరిస్థితి. కొన్నిప్రాంతాల్లో అయితే టమాటాల లూటీలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ఓ కూరగాయల వ్యాపారి కొనుగోలు దారుల లూటీ నుంచి టమాటాలకు బౌన్సర్లను పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల కర్ణాటకలో ఓ టమాటా రైతు.. చేతికొచ్చిన పంటంతా అమ్మి అప్పులు తీర్చాలనుకునేలోపే.. ఆ పంట మొత్తాన్నీ కాజేశారు. దాంతో ఆ రైతు లబోదిబోమన్నాడు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

బెంగళూరు చిత్రదుర్గలోని ఓ రైతు.. నిద్రహారాలు లేకుండా టమాట పంట చేతికొచ్చే వరకూ చూసుకున్నాడు. పంటను కోసి.. వాటిని వాహనంలోకి ఎక్కించాడు. సుమారు 2 వేల కిలోల వరకూ ఉంటుంది పంట. దానిని మార్కెట్ కు తీసుకెళ్లి.. అమ్మే ప్రక్రియను పూర్తి చేసేందుకు బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న కొందరు దుర్మార్గులు ఆ వాహనాన్ని ఫాలో అయ్యారు. ఓ ప్రాంతంలో టమాటాల లోడుతో వెళ్తున్న వాహనాన్ని పదే పదే ఢీ కొడుతూ పక్కదారి పట్టించారు. ఆ తరువాత రైతు, డ్రైవరుపై దాడి చేశారు. వారిద్ద ఉన్న డబ్బు లాక్కోవడమే కాకుండా.. ఖాతాల్లో ఉన్న డబ్బును తమ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అనంతరం టమాటాల లోడు వాహనంతో ఉడాయించారు. చేతికి అందివచ్చిన పంటతో పాటు.. డబ్బులు కూడా పోగొట్టుకున్న ఆ రైతు .. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టమాటా దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఇలాంటి ఘటనలు చూస్తే టమాటాలకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది కదూ.



Tags:    

Similar News