కటకటకాలుంటాయన్న బెదురు లేదు... శిక్షపడుతుందన్న బెంగ లేదు.. వేసేయడమే

తమిళనాడులో భరత్ అనే వ్యక్తిని భార్య నందిని, ఆమె ప్రియుడు సంజయ్ కలసి హత్య చేశారు

Update: 2025-07-24 06:25 GMT

కటకటకాలు ఉంటాయన్న బెదురు లేదు. శిక్షపడుతుందన్న బెంగ లేదు. స్కెచ్ వేసి కట్టుకున్నోడిని లేపేయడమే పనిగా పెట్టుకున్నారు. వరస సంఘలను కలకలం రేపుతున్నాయి. భర్తను భార్య ప్రియుడితో చంపించింది. తర్వాత ఏమీ తెలియనట్లు నంగనాచిలా మొహం పెట్టింది. కానీ మూడేళ్ల కూతురు చెప్పిన విషయంతో అసలు విషయం గుట్టురట్టయింది. ఎవరు హత్య చేశారో పోలీసులకు తెలిసిపోయింది. చివరకు భార్య తన భర్తను ప్రియుడితో హత్య చేయించిందన్న విషయం బయటపడింది. తమిళనాడులోని వేలూరులో ఈ హత్య జరిగింది. రెండు రోజుల క్రితం భరత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన భార్య, పిల్లలతో కలసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా భరత్ ను ఒక వ్యక్తి హత్య చేశాడు. దీంతో భార్య నందినితో పాటు ప్రియుడు సంజయ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా...
వేలూరు జిల్లా ఒడుకత్తూరు వద్ద కుప్పం పాళ్యానికి చెందిన భరత్ వంట చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చెన్నైలో ఒక హోటల్ లో పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం నందినితో వివాహమయింది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రతి వారం చెన్నై నుంచి కుటుంబం వద్దకు వచ్చి భరత్ గడుపుతూ వెళుతుంటాడు. అయితే ఎప్పటి లాగానే ఈ నెల 21వ తేదీ ఇంటికి వచ్చిన భరత్ తన భార్య నందిని, చిన్న కుమార్తెను తీసుకుని బైక్ పై షాపింగ్ వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో రహదారిపై కొబ్బరిమట్టలు అడ్డంగా పడివేయడంతో వాటిని దాటించబోయి కిందపడ్డాడు.
కాపు కాసి దాడి చేసి...
అయితే అక్కడే కాపు కాసిన నందిని ప్రియుడు భరత్ కత్తితో భరత్ పై దాడి చేసి పారిపోయాడు. అక్కడికక్కడే భరత్ ప్రాణాలు కోల్పోయాడు. నందిని మాత్రం తనకేమీ తెలియనట్లు మొహం పెట్టి ఏడుపులు లంకించుకుంది. ఎవరో ఒకరు వచ్చి హత్య చేసి వెళ్లారంటూ బుకాయించింది. అయితే బైకు పై భరత్ తోనే ఉన్న మూడేళ్ల కుమార్తె మాత్రం సంజయ్ మామ తన తండ్రిని కొట్టాడని చెప్పడంతో ఎవరీ సంజయ్ అని ఆరా తీశారు. నందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని వెల్లడయింది. భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తొలిగించుకునేందుకు ప్లాన్ వేసినట్లు నిర్ధారించారు.పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి జైలుకు తరలించారు.



Tags:    

Similar News