అప్సర హత్య కేసు : సీన్ రీ కన్ స్ట్రక్షన్

శుక్రవారం రాత్రి నిందితుడిని అప్సర హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు. సీన్..

Update: 2023-06-16 10:52 GMT

తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన మహిళ అప్సర(30)ను కిరాతకంగా హత్యచేసిన సాయికృష్ణ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. రంగారెడ్డి జిల్లాకోర్టు రెండ్రోజులు పోలీసుల కస్టడీకి అనుమతించింది. గురువారం సాయికృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి నిందితుడిని అప్సర హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ తో అప్సర హత్య ఎలా జరిగింది ? ఆ తర్వాత మృతదేహాన్ని ఎలా మ్యాన్ హోల్ లో పడేశాడన్న అంశాలపై పూర్తి స్పష్టత రానుంది.

జూన్ 17వ తేదీ మధ్యాహ్నంతో సాయికృష్ణకు పోలీసుల కస్టడీ పూర్తి కానుంది. అప్సర గర్భందాల్చడంతో తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసిందని సాయికృష్ణ పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. కానీ పోస్టుమార్టం రిపోర్టులో అలాంటి విషయాలేమీ వెల్లడికాలేదు. మరోవైపు సాయికృష్ణ కుటుంబ సభ్యులు అతను కావాలని ఈ హత్య చేయలేదంటూనే.. అప్సర పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడం వల్లే హత్య చేశాడని అంటున్నారు. అప్సర తల్లిదండ్రులు.. సాయికృష్ణను కఠినంగా శిక్షించాలంటున్నారు. అప్సరకు గతంలోనే వివాహం అవ్వగా.. ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేక తన కొడుకు చనిపోయాడంటూ కార్తీక్ రాజా తల్లి విడుదల చేసిన ఆడియో వైరల్ అయింది.


Tags:    

Similar News