పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వైసీపీ నేత..

తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేతిలో ఓటమిపాలయ్యారు.

Update: 2022-12-01 12:29 GMT

varupula subbarao

ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏపీ గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత, అది కూడా అధికార పార్టీకి చెందిన నేతపై పోలీసులు పేకాట కేసు నమోదు చేయడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారావు..2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.

తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన వరుపుల సుబ్బారావు.. 1983 నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు. తొలుత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేతిలో ఓటమిపాలయ్యారు. టీడీపీలో చేరిన వరుపుల మరోమారు ముద్రగడ చేతిలోనే ఓడిపోయారు. తొలి సారిగా 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల ఓటమి పాలై.. 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో టికెట్ రాకపోవడంతో వైసీపీలో చేరారు.


Tags:    

Similar News