సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన యాంకర్ రవి

బిగ్ బాస్ హౌస్ 5 సీజన్ లో కంటెస్టెంట్ గా వెళ్లి వచ్చిన యాంకర్ రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు

Update: 2021-12-14 12:51 GMT

బుల్లితెరపై యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న రవి.. బిగ్ బాస్ హౌస్ 5 సీజన్ లో కంటెస్టెంట్ గా వెళ్లి.. ఇటీవలే నుంచి బయటికి వచ్చాడు. ఇప్పటి వరకూ రవి యాంకర్ గా తానేంటో చూపించాడు. తన మాటలు, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ.. తన కుటుంబం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రవి, అతని కుటుంబ సభ్యులపై కొందరు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రవి. తనపై ఎన్నిరకాల కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా ఉండే రవి.. తన కుటుంబ సభ్యులపై తప్పుడు కామెంట్లు చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేసిన ప్రతి బ్యాడ్ కామెంట్ కు సమాధానం చెప్పాల్సిందే అని రవి పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యులను....
ఇక బిగ్ బాస్ సీజన్ 5లో రవి ఎలిమినేషన్ అనూహ్యం. రవి ఎలిమినేషన్ ను ఏమాత్రం ఊహించని అభిమానులు.. బిగ్ బాస్ అంతా ఫేక్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ లో ఎలిమినేట్ చేయాల్సిన వారిని వదిలేసి.. అందరితో కలివిడిగా ఉండేవారిని అన్యాయంగా ఎలిమినేషన్ చేస్తున్నారని వాపోయారు. కాగా.. ఎలిమినేషన్ తర్వాత కాస్త ఉపశమనం కోసం రవి తన ఫ్యామిలీతో కలిసి హాలిడే కి వెళ్లొచ్చాడు. ఇప్పుడు రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. ఇదే హాట్ టాపిక్ గా మారింది. రవి, రవి ఫ్యామిలీని ఎవరేమన్నారో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.


Tags:    

Similar News