జేసీ అనుచరుడిపై కత్తిపోట్లు...తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం జరిగింది.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం జరిగింది. గండికోట కార్తీక నిన్న రాత్రి విధులు ముగించుకుని వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
పరిస్థితి విషమం...
కార్తీక్ ను కాపు కాసి మరీ కత్తులు, కర్రలతో దాడులు చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం అతనని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది.