మైసూరు టూరిజం పేరుతో మాయ.. చిక్కుల్లో సిక్కోలు యాత్రికులు

మైసూర్ టూరిజం పేరుతో ఏజెంట్ మోసం చేసిన ఘటన తెలిసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యాత్రికులు చిక్కుల్లో పడ్డారు.

Update: 2021-11-24 05:32 GMT

మోసం అన్ని చోట్లా ఉంటుంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దానిని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. మైసూర్ టూరిజం ప్యాకేజీ పేరుతో ఒక ఏజెంట్ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 248 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన యాత్రికులు చిక్కుల్లో పడ్డారు.

ప్యాకేజీ పేరుతో...
మైసూరు టూరిజం ప్యాకేజీ ప్రకటన చూసి శ్రీకాకుళం జిల్లాకు చెందిన యాత్రికులు ఏజెంట్ అకుకల్ ను సంప్రదించారు. మైసూరు చుట్టుపక్కల ప్రాంతాలను చూపించడంతో పాటు వసతి, భోజన ఏర్పాట్లు కూడా తామే చేస్తామని నమ్మబలికారు. యాత్రికుల నుంచి సొమ్ములు వసూలు చేశారు.
ఏజెంట్ పరారీ....
తీరా మైసూరుకు వెళ్లి అక్కడ కాంటినెంటల్ పంచవటి హోటల్ లో బస చేశారు. ఏజెంట్ అకుల్ పరారీ అయ్యాడు. హోటల్ యాజమాన్యం వసతికి డబ్బు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. తాము ఏజెంటుకు చెల్లించామని చెప్పినా వారు తమకు సంబంధం లేదని చెబుతున్నారు. 240 మంది యాత్రికులను హోటల్ యాజమాన్యం నిర్భంధించినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News