Road Accident : రోడ్డు ప్రమాదంలో 71 మంది స్పాట్ డెడ్
ఆప్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 71 మంది మృతి చెందారు
ఆప్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 71 మంది మృతి చెందారు. ఆప్ఘనిస్తాన్ లోని పశ్చిమ హెరాట్ ప్రావిన్స్, హెరాలట్ ఇస్లాంఖలా హైవేపై నిన్న అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి ఆప్ఘాన్ కు వెళుతున్న వలసదారులను తీసుకు వెళుతున్న బస్సును ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో బస్సులో ఇంజిన్ భాగం పేలి భారీ పేలుడు సంభవించింది.
మృతదేహాలు గుర్తుపట్టలేనంత...
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 71 మంది అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు కూడా గుర్తుపట్టడానికి వీలులేనంతగా మారిపోయాయి. దీంతో పాటు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు కూడా మరణించారు. బస్సులో ప్రయాణించే వారిలో కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.