Chennai : చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ స్వాధీనం
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కస్టమ్స్ అధికారులు చెన్నై ఎయిర్ పోర్టు నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇథియోపియా నుంచి వచ్చిన విమానంలో వచ్చిన నలుగురు స్మగ్లర్లను కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు.
56 కోట్ల విలువైన...
ఇథియోపియా నుంచి తీసుకు వచ్చిన కొకైన్ ను ఎక్కడకు తీసుకెళుతున్నారు? ఎవరికి సరఫరా చేయడానికి దీనిని తీసుకు వచ్చారన్న దానిపై విచారణ జరుగుతుంది. మరొక వైపు వారివద్ద నుంచి రూ.56 కోట్ల విలువైన 5.6 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ క్యాప్సుల్స్ రూపంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు తేలింది. అరెస్టయిన వారిలో ఓ నైజీరియన్ యువకుడు కూడా ఉన్నాడు.