ఘోరప్రమాదం : 5గురు మృతి, 70 మందికి గాయాలు
కడలూర్ నుంచి వేగంగా వెళ్లున్న బస్సు ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పింది. అదే సమయంలో పన్రుతి నుంచి కడలూర్..
bus accident in tamilnadu
రెండు ప్రైవేటు బస్సులు పరస్పరం ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తమిళనాడులోని కడలూర్ లో సోమవారం జరిగింది. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఈ రోజు(జూన్19) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
కడలూర్ నుంచి వేగంగా వెళ్లున్న బస్సు ముందు టైరు పేలిపోవడంతో అదుపుతప్పింది. అదే సమయంలో పన్రుతి నుంచి కడలూర్ వైపు వస్తున్న బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు నిర్వహించారు. సీఎం స్టాలిన్ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.