ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు చిన్నారులు సహా 11 మంది దుర్మరణం
రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపి సమీపంలో జరిగిన ప్రక్కు ప్రమాదంలో 11 మంది మరణించగా.. 8 మంది గాయపడ్డారు.
రాజస్థాన్‌లోని దౌసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపి సమీపంలో జరిగిన ప్రక్కు ప్రమాదంలో 11 మంది మరణించగా.. 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. బాపి సమీపంలో జరిగిన ప్రమాదంలో 7 చిన్నారులు సహా 11 మంది మరణించినట్లు దౌసా జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్ తెలిపారు. 8 మందిని చికిత్స కోసం రిఫర్ చేయగా, 3 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్యాసింజర్ పికప్ వాహనం, మినీ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంపై ఎస్పీ సాగర్ రాణా మాట్లాడుతూ.. ఖాతు శ్యామ్ టెంపుల్ నుంచి వస్తున్న భక్తులకు ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7-8 మందిని జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రికి చికిత్సకు పంపినట్లు వెల్లడించారు.