విషాదం.. భవనంలో మంటలంటుకుని ఏడుగురు సజీవదహనం

శనివారం తెల్లవారుజామున ఇండోర్ జిల్లాలోని స్వర్ణ్ బాగ్ కాలనీలో ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా..

Update: 2022-05-07 05:43 GMT

ఇండోర్ : ఓ భవనంలో మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమైన విషాదకర ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. శనివారం తెల్లవారుజామున ఇండోర్ జిల్లాలోని స్వర్ణ్ బాగ్ కాలనీలో ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎలక్ట్రిక్ మీటర్లో వచ్చిన షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక అధికారుల ప్రాథమిక విచారణలో నిర్థారణ అయింది. రెండు అంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. పార్కింగ్ లో ఉన్న వాహనాలకు అంటుకున్నాయి. అనంతరం మంటలు భవనానికి వ్యాపించాయి.

అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. తెల్లవారుజామున జరిగిన ఘటన జరగడంతో ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, తీవ్రగాయాలపాలైన మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ.. మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Tags:    

Similar News