రైలులో చెలరేగిన మంటలు.. 5 మంది సజీవ దహనం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు
5 Killed In Bangladesh Train Fire, Police Suspect Arson Ahead Of Polls
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. నాలుగు కోచ్‌లు మంటలకు ఆహుతి అయ్యాయి. ఐదురుగురు చనిపోయారని, వారి మృతదేహాలను గుర్తించామని పోలీసు కమాండర్ అల్ మోయిన్ తెలిపారు. ఢాకాలోని ప్రధాన రైల్వే టెర్మినల్ గోపీబాగ్ వద్ద రైలులో మంటలు చెలరేగారు. వందలాది మంది పరిగెత్తుకొచ్చి మంటల్లో కాలిపోతున్న ట్రైన్ నుంచి చాలా మంది ప్రయాణికులకు బయటకు లాగారని వెల్లడించారు. మంటలు చాలా త్వరగా వ్యాపించాయని వివరించారు. ఈ రైలులో కొందరు భారతీయులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.