11ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. అతని తప్పేమీ లేదన్న బాలిక
ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు పట్టుమని పదిహేనేళ్లైనా లేని ఆడపిల్లలకు గుట్టుచప్పుడు కాకుండా వయసులో..
11 years girl marriage with 40 years old man
సమాజంలో వయసు మీద పడుతున్నా పెళ్లికాని ప్రసాదులెందరో ఉన్నారు. లక్షల జీతాలొచ్చే ఉద్యోగం ఉన్నా అందం లేక.. అందంగా ఉన్నవారికి సరైన ఉద్యోగం, చేతినిండా సంపాదన లేక చాలా మంది ఇంకా పెళ్లిళ్లు కాక సతమతమవుతున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు పట్టుమని పదిహేనేళ్లైనా లేని ఆడపిల్లలకు గుట్టుచప్పుడు కాకుండా వయసులో రెండు మూడింతలు పెద్దవాడైన వాళ్లకిచ్చి పెళ్లి చేసేస్తున్నారు. అందుకు రకరకాల కారణాలు చెబుతున్నారు.
తాజాగా బీహార్ లో 11 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. సివాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసుల చెవిన పడటంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తి మహేంద్ర పాండేను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆ బాలిక ఇందులో మహేంద్ర తప్పేమీ లేదని.. చేసిన అప్పులు తీర్చలేక తన తల్లే అతడిని పెళ్లి చేసుకోమని ఒప్పించిందని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.