నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మృతి

మిజోరంలో బుధ‌వారం నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మరణించారు.

Update: 2023-08-23 07:23 GMT

మిజోరంలో బుధ‌వారం నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది మరణించారు. శిథిలాల్లో చాలా మంది చిక్కుకున్నారని.. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వంతెన కూలిపోయిన సమయంలో దాదాపు 35 నుంచి 40 మంది నిర్మాణ కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలోని సాయిరాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి ₹ 2 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. "ఐజ్వాల్ సమీపంలోని సాయిరాంగ్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈరోజు కూలిపోయింది. 17 మంది కార్మికులు మరణించారు: రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతుంది. మరణించిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News