అమానుషం.. విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు
ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
10th student amarnath killed
తోటి స్నేహితుడే తనపై దాడి చేస్తాడని ఊహించలేదు. ట్యూషన్ కు వెళ్లొస్తున్న పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ పై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలులో జరిగింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎప్పటిలాగానే శుక్రవారం ఉదయం ట్యూషన్ కు వెళ్లొస్తున్న అమర్నాథ్ పై.. మార్గమధ్యంలో రెడ్లపాలెం వద్ద వెంకటేశ్వరరెడ్డి, మరికొందరు కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
అమర్నాథ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అరుపులు, కేకలు పెట్టాడు. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే మంటలు ఆర్పి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన స్నేహితుడు వెంకటేశ్వర్ రెడ్డి.. మరికొందరితో కలిసి తనపై దాడి చేసినట్లు అమర్నాథ్ పేర్కొన్నాడు. అమర్నాథ్ వాంగ్మూలంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.