Gold Prices Today : పసిడిప్రియులకు తీపికబురు.. బంగారం ధరలు పెరగలేదండోయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బంగారం ధరలు పెరగకపోతే అదే పదివేలు అనుకునే రోజులు వచ్చాయి. మరి కొద్ది రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి వస్తువుల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. వివాహాలు, శుభకార్యాలకు అవసరమైన బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే ధరలు ఇక పెరగకూడదంటూ కొనుగోలు దారులు కోరుకుంటున్నారు. కానీ ధరల పెరుగుదల, తగ్గుదల ఎవరి చేతిలోనూ ఉండదు. డిమాండ్, సీజన్ తో సంబంధం లేకుండా ధరల్లో మార్పులు జరిగేది బంగారం, వెండి విషయంలో మాత్రమే. అందుకే ధరలు పెరగకూడదని కోరుకున్నా, ఇంకా తగ్గాలని భావించినా అది అత్యాశే అవుతుంది. అనేక కారణాలతో వాటి ధరలు ఎప్పటికప్పుడు ప్రతిరోజులు రెండు సార్లు మారుతుంటాయి.
జనరేషన్ తో సంబంధం లేకుండా...
బంగారం అంటే అందరూ ఇష్టపడతారు. జనరేషన్ తో సంబంధం లేకుండా పసిడి అంటే మక్కువ చూపుతారు. అయితే ధరలు తగ్గితే మాత్రం పెట్టుబడి పెట్టిన వారు నిరాశ పడటం ఎంత సహజమో...కొనుగోలు చేయాలనుకున్న వారు పెరిగినప్పుడు అంతే బాధపడటం సహజం. ధరల విషయంలో అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ తీసుకున్ననిర్ణయాలు, వివిధ దేశాలతో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు వంటివి ధరల్లో మార్పునకు కారణమని చెప్పాలి. ఇప్పటికే ధరలు సామాన్యుడికి, మధ్యతరగతి, వేతన జీవులకు అందుబాటులో లేకుండా పోయాయి.
నేటి ధరలు ఇలా...
ఇక పెట్టుబడి పెట్టేందుకు కూడా చాలా మంది భయపడిపోతున్నారు. బంగారం వెండి పై పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్న వారు అనేక మంది ఉన్నారు. అయితే వారంతా దీర్ఘకాలం పెట్టుబడులను ఉంచితే లాభాలు పొందవచ్చని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా నమోదయ్యాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,59,610 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధరలు 2,99,900 రూపాయలకు చేరుకుంది.