Gold Rates Today : మళ్లీ షాకిచ్చాయిగా.. నేడు బంగారం, వెండి ధరలు ఎంతంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలకు బ్రేకుల్లేకుండా పోయాయి. ఇటీవల కొద్ది రోజుల పాటు ధరలు తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. శ్రావణ మాసం ఆరంభం నుంచి కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా పది గ్రాముల బంగారం ధర ఇంకా లక్ష రూపాయలకు పైగానే ఉంది. వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పు లేదు. బంగారం, వెండి వస్తువుల ధరలు పెరుగుతుండటమే తప్ప తగ్గడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లోనూ, లేని రోజుల్లోనూ ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. బంగారం, వెండి ధరల్లో మార్పులు ప్రతి రోజూ రావడానికి అనేక కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తగ్గుతాయన్న వార్తలు...
బంగారం ధర ఒక్కసారి పెరిగి కొండెక్కి కూర్చుంటే మళ్లీ దిగిరావడం అనేది జరగదని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది. ఒకవేళ తగ్గినా పదో పరకో తప్పించి పెరిగినంత స్థాయిలో ఖచ్చితంగా చెప్పవచ్చని వారు అనుభవ పూర్వకంగా చెబుతున్నారు. బంగారానికి డిమాండ్ లేకపోయినా వాటి విలువ మాత్రం ఎన్నటికీ తగ్గదని, అందుకే బంగారం విషయంలో భారీగా ధరలు తగ్గుతాయని వస్తున్న వార్తలు కూడా శుద్ధ అబద్ధమని వ్యాపారులు కొట్టిపారేస్తున్నారు. బంగారానికి మించిన పొదుపు చేసే అవకాశం మరొకటి లేకపోవడం, భూములను కొనుగోలు చేయడానికి కొనుగోలు శక్తి లేకపోవడంతో కొందరు ఖచ్చితంగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది.
స్వల్పంగా పెరిగినా...
బంగారం అంటే కేవలం సెంటిమెంట్ గానే చూడరు. స్టేటస్ సింబల్ గానూ చూస్తారు. అందుకే బంగారం, వెండి ధరలు నిత్యం పరుగు పెడుతూనే ఉంటాయి. అయితే వాటిని కొనుగోలు చేసినంత మాత్రాన ఎలాంటి పరిస్థితుల్లో నష్టం ఉండదని కూడా వ్యాపారులు చెబుతున్నారు. బంగారంపై పెట్టుబడి సురక్షితంగానే ఉంటుందంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉందయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 94,060 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,610 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,29,900 రూపాయలుగా ఉంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది.