Gold Price Today : షాకిచ్చిన గోల్డ్.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. ఎందుకంటే బంగారం ధరల మార్పులు ఎవరి చేతుల్లో ఉండవు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ నిర్ణయాలు వంటివి కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే బంగారం ధరలు ఇంకా తగ్గుతాయని వేచి ఉండటం అనేది వృధా. అలాగని మన వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకోవడానికి ఇదే మంచి సమయం అని భావించడమూ అంతే వృధా అని అంటుంటారు. అందుకే ధరల ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని, ఏ రోజుకారోజు ధరల్లో మార్పులు వస్తాయని అంటున్నారు.
గత కొద్ది రోజులుగా...
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతున్నాయి. అయితే పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు మాత్రమే తగ్గుతుంది. అదే పెరిగితే మాత్రం పది గ్రాములపై వందల రూపాయలు పెరుగుతుంది. అందుకే పెరుగుదలకు, తగ్గుదలకు మధ్య పొంతన ఉండటం లేదు. పెరిగినంత మేరకు ధరలు దిగిరావడం లేదు. అందుకే గత కొద్ది రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల నుంచి దిగి రావడం లేదు. లక్ష రూపాయలకు పైగానే కొనసాగుతుండటంతో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అందులోనూ బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేయాల్సిన ఈ సీజన్ లో ధరలు పెరుగుదలతో అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు పెరిగి...
మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ బంగారం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో పాటు పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారాన్ని పక్కన పెట్టి ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,150 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,620 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,30,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు చేర్పులు జరగవచ్చు.