Gold Rates Today : ధరలు పెరుగుతున్నాయ్.. నేటి బంగారం ధరలు ఎంతంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి

Update: 2025-08-28 03:55 GMT

బంగారానికి ధరలు పెరగడమే తెలుసు. తగ్గడమనేది అస్సలు తెలియదు. ఎందుకంటే కొన్నేళ్లుగా.. దశాబ్దాలుగా చూస్తున్న వారికి ఈ పరిస్థితి అర్థమవుతుంది. ఇరవై ఏళ్ల క్రితం బంగారం ధరలకు.. నేటి ధరలకు అసలు పొంతనే లేదు. నాడు పది వేల రూపాయల లోపు పది గ్రాముల బంగారం లభిస్తే.. నేడు లక్ష రూపాయలు పెట్టినా పది గ్రాములు కూడా దొరకడం లేదు. బంగారానికి మామూలుగానే డిమాండ్ ఎక్కువ. అందరూ ఇష్టపడేదే. కానీ అదే సమయంలో డిమాండ్ ను బట్టి ధరలు పెరగడం లేదన్నది కూడా వాస్తవం. బంగారం దిగుమతులు తక్కువ కావడంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

సంప్రదాయాల మేరకు...
బంగారాన్ని ఎవరూ కాదనకోరు. అత్యంత ఇష్టపడే వస్తువు అదే. ముఖ్యంగా మహిళలు చీరలతో పాటు బంగారాన్ని అధికంగా ప్రేమిస్తారు. బంగారం కొనుగోలు చేయడమే తమ జీవితాశయంగా పెట్టుకుంటారు. కష్టపడి అయినా సొమ్ములు దాచుకుని బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అందుకే జ్యుయలరీ దుకాణాల యాజామాన్యం మంత్లీ స్కీమ్ లను అందుబాటులోకి తేవడంతో నెల నెల దాచుకున్న డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేయడాన్ని నేర్పించారు. అందులోనూ బంగారం ఉంటే భవిష్యత్ కు భరోసా ఉంటుందన్న నమ్మకంతో పాటు సమాజంలోనూ, తోటి బంధువల మధ్య తమకు గౌరవం లభిస్తుందని భావించి విరివిగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు.
ధరలు పెరిగి...
కానీ గత కొద్ది రోజుల నుంచి బంగారాన్ని కొనుగోలు చేయడం కష్టంగా మారింది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ బంగారం ధరలు పెరిగిపోవడంతో దానిని కొనుగోలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. బంగారన్ని కొనుగోలు చేయాలని మనసు పీకుతున్నా ఆర్థిక పరిస్థితులు మాత్రం అందుకు సహకరించడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,910 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,02,450 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,29,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News