Gold Price Today : గుడ్ న్యూస్ అనలేం కానీ.. ధరలు దిగి వస్తున్నాయిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు నిత్యం పెరుగుతూనే ఉంటాయి. ధరలు పెరగడం మామూలుగా మారింది. అందుకే ధరలు పెరిగినా పెద్దగా ఆశ్చర్యపోకుండా మదుపరుల నుంచి కొనుగోలుదారుల వరకూ మనసు స్థిమితం చేసుకుంటున్నారు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు తరచూ చెబుతుంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడిందని చెబుతున్నారు.
ధరలు తగ్గుతున్నా...
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల కోసం నిరంతరం పరిశీలిస్తూనే ఉంటారు. కొనుగోలు చేయాల్సిన వారు కొంచెం ధరలు దిగి వస్తే కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలోనే గత నాలుగైదు రోజుల నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే తగ్గిన బంగారం ధరలు వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పడానికి పెరగని అమ్మకాలే ఉదాహరణ అని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం చెబుతుంది. ఇంకా ధరలు దిగి వస్తే తప్ప డిమాండ్ పెరగదని భావిస్తుంది. మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తున్నప్పటికీ ఆశించినంత మేర కొనుగోళ్లు జరగడం లేదంటున్నారు.
స్వల్పంగా తగ్గినా...
మరొకవైపు పెట్టుబడి దారులు కూడా సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా బంగారం ధరలు పూర్తిగా పతనమయితే తమకు నష్టం వాటిల్లుతుందని భావించి వారు పసిడిపై పెట్టుబడికి దూరంగా ఉంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 92,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,180 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,26,200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.