YSRCP : ఏపీలో నేడు వైసీపీ నిరసనలు
నేడు దళిత సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నిరసన ప్రదర్శనలు చేస్తుంది
నేడు దళిత సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసీపీ నిరసన ప్రదర్శనలు చేస్తుంది. వైసీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు నిరసనగా పార్టీ ఎస్సీ సెల్, దళిత సంఘాలతో కలిసి జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారకు. జిల్లా కేంద్రాల్లోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఉదయం 10 గంటలకు నిరసనలకు పిలుపునిచ్చింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన...
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రాష్ట్రంలో దళితులతో పాటు వైసీపీ నేతలను హతమారుస్తున్నారని, ఈ సంస్కృతిని విడనాడాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు వరస హత్యలకు గురవుతున్నప్పటికీ అందుకు కారణమయిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని నిరసనలు తెలియజేస్తున్నారు.