Andhra Pradesh : నేడు టీడీపీలో చేరనున్న వైసీపీ నేత
వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు
వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ ఇటీవల తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఈరోజు సాయంత్రం టీడీపీలోకి తన అనుచరులతో కలసి మర్రి రాజశేఖర్ చేరనున్నారు.
టిక్కెట్ దక్కకపోవడంతో...
మర్రి రాజశేఖర్ కు 2019, 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట అసెంబ్లీ టిక్కెట్ వైసీపీ ఇవ్వలేదు. దీంతో 2024 లో ప్రభుత్వం మారిన తర్వాత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచనతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా ఆమోదం పొందకపోయినా టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడతో ఇవాళ పార్టీ కండువా కప్పుకోనున్నారు.