నేడు పోలీసుల ఎదుటకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు

Update: 2025-10-08 02:41 GMT

వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. వీరిని విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జంట హత్యల కేసులో తమకు సంబంధం లేదని, రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ పిన్నెల్లి సోదరులు న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

జంట హత్యల కేసులో...
అయితే జంట హత్యల కేసులో ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడువిచారణకు హాజరు కానున్నార. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై పిన్నెల్లి సోదరులు బయట ఉన్నారు.


Tags:    

Similar News