కొత్తపల్లి సస్పెన్షన్ వెనక?

వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి కొత్త పల్లి సుబ్బరాయుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2022-06-02 01:41 GMT

వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి కొత్త పల్లి సుబ్బరాయుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సుబ్బరాయుడు వ్యవహరిస్తుండటంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై సస్పన్షన్ వేటు వేసింది. గత కొద్ది రోజులుగా కొత్త పల్లి సుబ్బారాయుడు జిల్లా కేంద్రాన్ని భీమవరంను ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సుబ్బారాయుడు ఆందోళనలలో స్వయంగా పాల్గొనుతుండటంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా....
ప్రధానంగా నరసాపురం జిల్లా సాధన సామితి ఉద్యమంలో సుబ్బరాయుడు చురుగ్గా పాల్గొంటున్నారని, స్వయంగా పోరాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పార్టీకి ఫిర్యాదులు అందాయి. నరసాపుంర ఎమ్మెల్యే ప్రసాదరాజుపై ఆయనపై బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. దీంతో పార్టీ అధినాయకత్వం ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లింది. జగన్ ఆదేశాల మేరకు కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.


Tags:    

Similar News