Ys Jagan : ఉదయం 11 గంటలకు జగన్ మీడియా సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు నుంచి ఏపీకి రానున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగళూరు నుంచి ఏపీకి రానున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ మీడియా సమావేశంలో బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు కేటాయించిన నిధులతో పాటు ప్రజలకు ప్రభుత్వం మోసం చేస్తున్న విధానాన్ని ఎండగట్టనున్నారు.
బడ్జెట్ లోకేటాయింపులపై...
అదే సమయంలో బడ్జెట్ సమావేశాలపై ఆయన ఈ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. హామీలు ఇచ్చిన పథకాలకు అరకొర కేటాయింపులు చేస్తూ, లబ్దిదారుల సంఖ్యను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ మండిపడనున్నారు. దీంతో పాటు వైసీపీ నేతల వరస అరెస్ట్ లపై కూడా వైఎస్ జగన్ స్పందించనున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి కేసుల గురించి ఈ మీడియా సమావేశంలో ప్రస్తావించనున్నారు.