Ys jagan : నేడు నర్సీపట్నానికి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నర్సీపట్నం పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు.

Update: 2025-10-09 01:54 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నర్సీపట్నం పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఆయన నర్సీపట్నంకు వెళ్లి అక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శిస్తారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మెడికల్ కళాశాలల సందర్శనలను ఇప్పటి వరకూ పార్టీ నేతలు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా స్పీకర్ నియోజకవర్గంలో జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి నియోజకవర్గం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

రోడ్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో...
జగన్ రోడ్ షోలకు పోలీసులు అనుమతించలేదు. తొలుత వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి రహదారి మార్గంలో రోడ్డు షో నిర్వహిస్తూ వెళ్లాలని నిర్ణయించారు. అయితే ట్రాఫిక్ సమస్యలతో పాటు విశాఖలో మహిళల అంతర్జాతీయ క్రికెట్ జరుగుతుండంతో అనుమతిని నిరాకరించారు. మరొక వైపు వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనకు ఉత్తరాంధ్ర నుంచి పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముండటంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారని భావించి ప్రత్యామ్నాయ మార్గాలను వైసీపీ క్యాడర్ ఎంచుకుందని నేతలు చెబుతున్నారు. మొత్తం మీద నేడు నర్సీపట్నంలో వైఎస్ జగన్ పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా.. ఆసక్తికరంగా సాగనుంది.


Tags:    

Similar News