Andhra Pradesh : నేడు మిధున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో గత యాభై రోజుల పైగానే మిధున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిధున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు.
రెగ్యులర్ బెయిల్ కోసం...
దీనిపై నేడు ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది. ఇటీవల ఐదు రోజుల పాటు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు మిధున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ను పొందారు. తర్వాత తిరిగి రాజమండ్రి జైలులో లొంగిపోయారు. అయితే మిధున్ రెడ్డికి బెయిల్ ఇవ్వవ్వద్దని, బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించనున్నారు.