జగన్ లండన్ పర్యటనపై షర్మిల విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కుటుంబ

Update: 2024-05-24 15:46 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కుటుంబ సమేతంగా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా ఆయన సోదరి, వైసీపీ చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు.

ఏపీలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని అయితే ప్రభుత్వం ఏమి చేస్తోందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఏలూరులో 13 ఏళ్ల బాలికపై స్కూల్‌లో సీనియర్‌ అత్యాచారం చేసిన ఘటనపై షర్మిల స్పందిస్తూ జగన్‌ను ప్రశ్నించారు. "నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది. లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు." అంటూ షర్మిల ట్వీట్ చేశారు.


Tags:    

Similar News